కుక్కలు పెంచుకుంటే మనకు రక్షణ ఇస్తాయి అని తెలుసు.. ఎవరైనా కొత్త వారు ఇంట్లోకి వస్తే అరిచి, వారిని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే కుక్కలతో పాటు.. పిల్లులను కూడా పెంచుకుంటారు. అవి.. ఇంట్లో ఉన్న ఎలుకలను ఎప్పటికప్పుడు చంపి తినేస్తాయి. పిల్లులను ఎక్కువగా ఎలుకల బెడద నుంచి రక్షించేందుకు మాత్రమే పెంచుకుంటారని తెలుసు.. కానీ ఓ మాల్లో పిల్లి సెక్యూరిటీ గార్డ్ అవతారమెత్తింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో కలిసి పని చేస్తోంది.
Read Also: Budget 2024: తొలిసారిగా, అణుశక్తిలో పెట్టుబడులకు ప్రైవేట్ రంగానికి అనుమతి..
వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌లోని ఓ మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. ఈ పిల్లి అస్సలు పనికి తగ్గకుండా.. సెక్యూరిటీ సిబ్బందితో విధులు నిర్వహిస్తోంది. పిల్లి చేసే పనుల్లో అలసటే కనపడటం లేదు. ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది. అంతేకాకుండా.. కోనన్ బ్యాగ్‌లను తనిఖీ చేయడంలో సెక్యూరిటీ సిబ్బందికి సాయపడుతుంది. ఎవరైనా మాల్‌కి పెంపుడు జంతువులను తెచ్చుకుంటే వాటిని కూడా స్వాగతిస్తుంది ఈ పిల్లి.
Read Also: NEET UG 2024 Counselling: రేపు నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ..ఈ పత్రాలు తప్పనిసరి
మాల్‌లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో భాగమైపోయిన ఈ పిల్లి వయస్సు.. 6 నెలలు. తాను చేసే పనే కాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది చేసే పని ఒత్తిడిని తగ్గిస్తోంది ఈ పిల్లి. దీనిని సెక్యూరిటీ గార్డ్ కోనన్ అని పిలుస్తారు. అయితే.. ఈ పిల్లి పనితీరును చూసిన కొంత మంది.. తమ మాల్స్ లో కూడా పిల్లులను పనిలో పెట్టుకోవాలని చూస్తున్నారు.