Site icon NTV Telugu

Uttar Pradesh: ఎద్దు బీభత్సం.. 4 ఏళ్ల చిన్నారికి గాయం

Bull

Bull

Uttar Pradesh:ఈ మధ్య కుక్కల దాడులు అధికంగా జరుగుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎద్దు నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేయడం కలకలం రేపింది. అలీగఢ్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారిని ఎద్దు విచ్చలవిడిగా ఢీకొట్టింది. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన విధంగా.. వీధిలో ఒంటరిగా నిలబడి ఉన్న చిన్నారిపై ఎద్దు వెనుక నుంచి దూసుకెళ్లింది. నాలుగేళ్ల చిన్నారిని కొమ్ములతో కొట్టిన తర్వాత పిల్లవాడిని విచ్చలవిడిగా తొక్కేసింది. ఆ తర్వాత నాలుగేళ్ల చిన్నారితో పాటు వచ్చిన ఓ వ్యక్తి.. చిన్నారిని రక్షించాడు. ఆ వ్యక్తి చిన్నారిని ఒంటరిగా వీధిలో వదిలి ప్లాట్‌లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Read Also: Chigurupati Jayaram Case: జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు

ఈ సంఘటన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. స్థానిక ప్రాంత వాసులలో భయాందోళనలను సృష్టించిన ఎద్దును పట్టుకోవడానికి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు.

Exit mobile version