NTV Telugu Site icon

Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్

Kidnap

Kidnap

Kidnap Drama: పేపర్ కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు కోపగించుకుంటారేమోనన్న భయంతో బాలిక చేసిన పనితో తల్లిదండ్రులే కాకుండా పోలీసులు కూడా కంగుతిన్నారు. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్లింది. స్కూల్ నుంచి వచ్చేసరికి ఆమె బట్టలు చిరిగిపోయాయి. ఆమెకు రక్తం కారుతోంది. దీంతో తల్లిదండ్రులు బాలికను కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నిజాలు విని పోలీసులు కూడా షాకయ్యారు.

Read Also: Amanda Bynes: నడిరోడ్డుపై నగ్నంగా నటి షికార్లు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

బాలిక 10వ తరగతి పరీక్ష జరుగుతోంది. ఆ అమ్మాయికి మార్చి 15న సోషల్ స్టడీస్ పేపర్ వచ్చింది. కానీ ఈ పేపర్ అమ్మాయికి కష్టమైంది. పేపర్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులకు కోపం వస్తుందని భయపడిన బాలిక.. తల్లిదండ్రుల అరుపులను తప్పించుకునేందుకు పథకం వేసింది. ఆమె తనకు తానే హాని చేసుకుంది. అప్పుడే కిడ్నాప్ డ్రామా సృష్టించింది. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వస్తుండగా ఇద్దరు ముగ్గురు గుర్తు తెలియని అబ్బాయిలు అడ్డుకున్నారని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆమెను వేధించాడు.. శారీరకంగా దాడి చేశారని చెప్పింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలతో పాటు, ఆమెకు DCW సభ్యుడు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

Read Also:Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

దీనికి సంబంధించి భజన్‌పురా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, శారీరక వేధింపుల కేసు నమోదైంది. బాలిక వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో బాధితురాలు చెప్పిన ఘటనా స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాలిక వివరించిన విధంగా సీసీటీవీ ఫుటేజీలో ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు. పోలీసులు బాలికకు కౌన్సెలింగ్ చేయగా బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. తన 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, సోషల్ స్టడీస్ లో రాణించలేకపోయానని ఆ అమ్మాయి చెప్పింది. తల్లిదండ్రులు బాధపడతారేమోనన్న భయంతో తనకు తానే హాని చేసి, కిడ్నాప్‌ను తల్లిదండ్రులకు మోసం చేసింది.