మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి రూ.1లక్ష , రూ. 50,000 వేల చొప్పున వసూలు చేసింది. ట్రైనింగ్ ఇప్పిచ్చి జాబులు ఇప్పిస్తానంటూ నమ్మించిన కంపెనీ ప్రతినిధులు మోసానికి పాల్పడ్డారు. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇప్పిస్తానంటూ నమ్మించి టోపీ పెట్టారు. బెంగళూరు విజయవాడ కేంద్రాలుగా మరిన్ని బ్రాంచ్ లు ఉన్నట్లు సమాచారం. బాధితుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేసింది.. కంపెనీ. ఉన్నపళంగా కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. మాదాపూర్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Kolkata doctor case: వైద్య బృందంతో కేంద్రం చర్చలు.. భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ
గత కొంతకాలం నుంచి నిరుద్యోగులకు కంపెనీ శిక్షణ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. దీని నమ్మి చాలా మంది నిరుద్యోగులు మోసపోయారు. మేనేజర్, ఉన్నత స్థాయి ఉద్యోగులెవరూ.. కాంటాక్ట్ లో లేరు. మా డబ్బులు తిరిగి ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులు, యజమాని దొరికితేనే పూర్తి విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేవని పోలీసులు వెల్లడించారు. యజమాని, మేనేజర్ కు ఫోన్ చేస్తే సమాధానం లేదన్నారు.
