Site icon NTV Telugu

Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ

Nidhi Agarwal

Nidhi Agarwal

నిధి అగర్వాల్‌కు ఎంత కష్టమొచ్చిందీ పగొడికి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్స్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకెళ్లినా సీన్ సేమ్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరి హర వీరమల్లు నుండి పిలుపొచ్చింది. పవన్ సార్‌తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది కానీ ఆ సినిమా వాయిదాలుగా తెరకెక్కేసరికి త్రీ, ఫోర్ ఇయర్స్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని చేసింది. కానీ ఈ కష్టమంతా వృథాగా మారింది. సినిమా రిజల్ట్ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్‪కు తెలిసిందే.

Also Read : Star Hero : స్టార్ హీరో కొడుకు తిరిగొచ్చాడు.. ట్రైలర్ రిలీజ్ చేసాడు..

స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటే తనెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయ్‌లో స్పెషల్ స్పెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగల్లేదు ఆమెకు.  మిరాయ్ టీం జస్ట్ థ్యాంక్స్ కార్డ్ వేసేసి సరిపెట్టేసింది. ఇక నిధి అగర్వాల్ హోప్స్ అన్నీ రాజా సాబ్‌పైనే. ఈ సినిమా కోసం కూడా 2 ఇయర్స్ టైం కేటాయించింది మేడమ్. కానీ వాయిదాల పర్వంతో వచ్చే ఏడాదికి జరిగిపోయింది. రాజా సాబ్ ప్రమోషన్లకు టైం ఉండటంతో వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్లిపోతుంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజా సాబే. ఇస్మార్ట్స్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడని అంటే ఆరేళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని భామకు డార్లింగ్ ఏమన్నా లక్కీ మ్యాన్ అవుతాడేమో. నిధి బిజీగా మారుతుందో లేక షాప్ ఓపెనింగ్స్‌కే పరిమితమౌతుందో చూడాలి.

Exit mobile version