Site icon NTV Telugu

Saba Nayagan : ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ..

Whatsapp Image 2024 02 14 At 1.25.43 Pm

Whatsapp Image 2024 02 14 At 1.25.43 Pm

అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్‌ కు పోటీగా డిసెంబర్‌లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ సినిమా ను రిలీజ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా సబా నాయగన్ నిలిచింది.

తాగిన మత్తు లో సబా (అశోక్ సెల్వన్‌) అనే యువకుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. లవ్ ఫెయిల్యూర్‌తోనే సబా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని పోలీస్ ఆఫీసర్ అర్థం చేసుకుంటాడు. అతడి ప్రేమకథను గురించి అడుగుతాడు. సబా జీవితంలోకి వచ్చిన రియా, మేఘ, దీప్తి ఎవరు.. అస్సలు ఈ ముగ్గురిలో సబా ఎవరిని ప్రేమించాడు అన్నదే ఈ మూవీ కథ.డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే లవ్ స్టోరీగా దర్శకుడు సీఎస్‌ కార్తికేయన్ ఈ మూవీని తెరకెక్కించాడు. థియేటర్లలో ఈ మూవీ పదిహేను కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరుతో పాటు అశోక్ సెల్వన్‌, మేఘాకాష్‌, చాందిని చౌదరి యాక్టింగ్ అభిమానులను ఎంతగానో మెప్పించాయి..కాగా సబా నాయగన్ మూవీ చాందిని చౌదరి ఫస్ట్ తమిళ్ మూవీ కావడం విశేషం. కాలేజీలో సబాను ప్రేమించే యువతిగా చాందిని చౌదరి కనిపించింది.గ్లామర్ రోల్ కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకొని తొలి సినిమాతోనే వైవిధ్యతను చాటుకున్నది.

Exit mobile version