ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా.. అభిమానుల కళ్లు మాత్రం స్కాటిష్ బౌలర్‌పైనే ఉండిపోయాయి. ఆ బౌలర్ హిజాబ్ ధరించి క్రికెట్ ఆడింది. మహిళల క్రికెట్‌లో ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. స్కాట్లాండ్‌కు చెందిన 25 ఏళ్ల బౌలర్ అబ్తాహా మక్సూద్ తొలిసారి ప్రపంచకప్ ఆడుతుంది. ఆమె.. ఇతర ఆటగాళ్ళలాగా టోపీ పెట్టుకోదు, హిజాబ్ ధరిస్తుంది. తల, మెడ చుట్టూ చుట్టుకుని ఉంటుంది. అయితే.. దుబాయ్‌లో 37 డిగ్రీల వేడిలో కూడా, అబ్తాహా హిజాబ్‌లో బౌలింగ్ చేయడం గమనార్హం.
Viral Video: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుక్కున్న అమ్మాయి.. ఏం చేసిందో చూడండి
ఈఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హిజాబ్ తన గుర్తింపు అని, అందుకు గర్వపడుతున్నానని అబ్తాహా తెలిపింది. స్కూల్ డేస్ నుంచి హిజాబ్ ధరిస్తున్నట్లు చెప్పింది. అయితే హిజాబ్ ధరించి క్రికెట్ ఆడటం అంత ఈజీ కాదని పేర్కొంది. తన చిన్నప్పటి నుంచి హిజాబ్ ధరించిన ముస్లిం అథ్లెట్‌ను చూడలేదని.. హిజాబ్ ధరించి క్రికెట్ ఆడటానికి వచ్చినప్పుడు చాలా భయపడ్డానని చెప్పింది. కానీ, తాను ధైర్యం కోల్పోలేదని.. తాను కూడా హిజాబ్ ధరించి క్రికెట్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. హిజాబ్ ధరించిన యువతులు తనను చూడగలుగుతారు.. వారు కూడా ధైర్యం పొందుతారని చెప్పింది.
ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..
అబ్తాహా క్రికెట్ ఆడటానికి ముందు.. హిజాబ్ ధరించి టైక్వాండో ఆడింది. ఆమె టైక్వాండోలో బ్లాక్ బెల్ట్. 2014లో ఈ క్రీడలో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో ఆమె స్కాట్లాండ్ జట్టు జెండా బేరర్ కూడా.