NTV Telugu Site icon

Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?

Lunar

Lunar

Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది.

Read Also: Uttam Kumar Reddy : దళిత స్పీకర్‌ను అవమానపరిచేట్లు మాట్లాడడం సరికాదు

ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తుంది. దీని కారణంగా చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులోకి కనిపిస్తాడు. కాగలాలంలో ఏర్పడే ఈ ప్రత్యేక దృశ్యాన్ని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఇకపోతే ఈ ఏడాది మొదటి గ్రహణం హోలీ పండుగ రోజు అంటే మార్చి 14న ఏర్పడనుంది. ఇక హోలీ నాడు ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం.

ఇక చంద్రగ్రహణంరోజు భూమి నీడ చంద్రునిపై ఏకంగా 99.1% వరకు కప్పేయనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం, మార్చి 14న ఉదయం 9:29 గంటలకు మొదలై మధ్యాహ్నం 3:39 గంటలకు అయిపోనుంది. ఇక మధ్యాహ్నం 12:29 గంటలకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉదయం 11:57 గంటలకు మొదలై మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది. ఇలా మొత్తంగా గ్రహణ దశ దాదాపు 6 గంటల పాటు ఉండనుంది.

Read Also: Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు

ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలరు. భారతదేశంలో గ్రహణ సమయానికి పగలు కావడం వల్ల ఇది అసలు కనిపించదు. ఐరోపాలో చంద్రుడు అస్తమించే సమయంలో గ్రహణం కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ముగియనుంది.