NTV Telugu Site icon

Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్​ బాలిక పై రేప్​ అటెంప్ట్​..!

1

1

పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్​ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ. దింతో బాధితురాలు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సదరు సిఐ పై కేసు నమోదు చేసింది. ఇదే స్టేషన్లోని సదరు సీఐ ఇదివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Also Read: CSK vs RCB: తొలి మ్యాచ్ లో చెన్నై ఘన విజయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిఐగా పనిచేస్తున్న బండారు సంపత్ గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు చేపట్టారు. ఇదివరకే పెళ్లయిన అతను.. తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే వీరి మధ్య కొంతకాలం వ్యవహారం బాగానే నడిచిన ఆ తర్వాత బదిలీ అయి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రమోషన్ లో భాగంగా సిఐగా పోస్టు సంపాదించి భూపాల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు.

Also Read: Moscow : మాస్కోలో భీకర ఉగ్రదాడి.. 60మంది మృతి, 140మందికి గాయాలు

ఈ కేసు పరంగా సిఐ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళలకు ఓ కూతురు ఉండగా తాజాగా ఆవిడ ఇంటికి సీఐ వెళ్లాడు. అయితే ఆ సమయంలో మహిళ కూతురు మాత్రమే ఉండడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు సిఐ. అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ అమ్మాయిపై రేప్ చేయబోయాడు. అయితే ఆయన నుండి ఎలాగోలాగ తప్పించుకున్న సదరు బాలిక జరిగిన పూర్తి విషయాన్ని తల్లికి చెప్పుకోగా.. తల్లి సిఐని నిలదియడంతో ఆయన తిరిగి వచ్చి వారికి బెదిరింపులకు గురి చేశారు. తాను పోలీసు బలాలతో తనకి, తన కూతురికి ఇబ్బందులు గురి చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో భయభ్రాంతులకు లోనైనా తల్లి కూతుర్లు ఇద్దరు రెండు రోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు అందించారు. దింతో ఈ కేసు సంబంధించిన సీఐ సంపత్ పై రేప్​ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఐను శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.