NTV Telugu Site icon

Viral News: వార్నీ.. ఏంట్రా ఈ టాలెంట్.. దండంరా బాబు..

Qr Code (2)

Qr Code (2)

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలను చూస్తుంటాము.. అందులో కొన్ని వార్తలు మైండ్ బ్లాక్ చేస్తే.. కొన్నిటిని చూస్తే ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది.. తాజాగా అలాంటి వార్తె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న వారంతా కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ..

రీసెంట్ గా ముంబైలో మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్‌సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. అక్కడ పాడిన పాటలు జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియదు కానీ అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి అందరి చూపును తనవైపుకు తిప్పుకున్నాడు.. ఏంటబ్బా అంతగా అతను ఏం చేశాడో అనుకుంటున్నారు కదూ.. అతను అంతగా ఏం చేశాడో అనే ఆలోచనలో ఉన్నారుగా ఒకసారి చూసేద్దాం..

అతని పేరు హార్దిక్.. ఈ షోలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు.. అతను టీ-షర్టుపై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసుకొని దానిని తొడుక్కొని వచ్చాడు. అక్కడ ఈవెంట్ కు వచ్చిన వారంతా స్కాన్ చెయ్యగా అది నేరుగా అతని డేటింగ్ యాప్ కు వెళ్లింది.. ఇది చూసిన అందరు ఒకింత షాక్ అయ్యారు.. కానీ ఆ తర్వాత అతని తెలివికి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు.. అతని తెలివికి ఫిదా అయ్యారు.. అతని క్యూఆర్ టీ షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దానిపై మీరు ఒక లుక్ వేసుకోండి..