NTV Telugu Site icon

Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే

Door

Door

Immoral Relationship : పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఉదంతాలు చాలానే చూశాం. కానీ కొన్ని అనైతిక సంబంధాలు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. అలాంటి జాబితాలోకే తాజాగా మరో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న మహిళ తన భర్త సొంత తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.

Read Also: Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్త తమ్ముడు(మరిది)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటికే ఆ వివాహితకు ముగ్గురు పిల్లలు. ప్రతిరోజు ఆమె భర్తకు రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్‌కి వెళ్లే అలవాటు ఉంది. ఓ రోజు భోజనం తర్వాత భర్త వాకింగ్ కి వెళ్లిన అవకాశం సద్వినియోగం చేసుకుని తమ్ముడు వదిన గదిలోకి ప్రవేశించాడు. కొంత సమయం తరువాత అన్నయ్య రావడంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే తమ్ముడు, అన్నవదిన రూంలోనే చిక్కుకుపోయాడు. సరైన క్షణం చూసి, తమ్ముడు గది నుండి బయటకు పరుగెత్తాడు.

Read Also: Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?

ఆ తర్వాత అన్నయ్య బయట వరండాలో పడుకున్నాడు. కొంత సేపటికి ఆమె స్వయంగా మరిదిని గదిలోకి రమ్మని పిలిచింది. నిద్రపోతున్న తమ్ముడు వదిన పిలుపు విని ఆమె రూంలోకి వెళ్తాడు. ఇదంతా నిద్రపోతున్నట్లు నటిస్తున్న అన్న చూస్తూనే ఉన్నాడు. కానీ, లోపల ఉన్న ఇద్దరూ ఇది గమనించలేదు. లోపలికి భర్త ప్రవేశించడంతో ఆమె కంగారుపడిపోయి కొడుకుని దగ్గరకు తీసుకుంటుంది. అయితే ఆమె భర్తకు అనుమానం వచ్చి ఆ షీట్‌ని లాక్కున్నాడు. ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న తమ్ముడిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కానీ తమ్ముడు అన్నపై చేయిచేసుకుంటాడు. చివరకు అతను అక్కడ నుండి తప్పించుకుని పరారయ్యాడు. మరుసటి రోజు వీరంతా పోలీసు స్టేషన్‌కు చేరుకుంటారు. సెహ్రామావు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ కుమార్ మిశ్రా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments