Site icon NTV Telugu

Countrymade Guns : తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Cp Sudheer Babu

Cp Sudheer Babu

కంట్రీమేడ్ తుపాకులు ఇల్లీగల్ సేల్ చేస్తున్న కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద్భంగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డి బీకామ్ మధ్యలోనే ఆపేశాడని, ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడని, ఈ క్రమంలోనే డాన్‌గా మారి పెద్ద క్రిమినల్‌గా మారాలనుకున్నాడని ఆయన వెల్లడించారు. అందుకోసం ముంబైకి వెళ్ళి గన్స్ కొనుకొచ్చాడని, వెపన్ యూజ్ చేసి ఏదో ఒక నేరం చేయాలని అనుకున్నారని, ఇతనిని నుండి ఏడు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. జనాలను భయబ్రాంతులకు గురి చేయడానికి వీటిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడని, కాకినాడలో రెండు దొంగతనాల కేసులో నిందితుడుగా ఉన్నాడన్నారు సీపీ సుధీర్‌ బాబు.

Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు

జైల్లో నుంచి విడుదల అయ్యాక హైదరాబాద్ లోని సూరారం కు వచ్చాడని, అమెజాన్లో కంపెనీలో జాయిన్ అయ్యాడని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో ఓ దొంగతనం కేసులో అరెస్టు అయ్యాడు,జైలుకు వెళ్ళాడని, ఆ సమయంలో ఇతనికి కాంట్రాక్టు పెరిగాయని, చిన్నచిన్న నేరాలు కాకుండా ఒకేసారి పెద్దపెద్ద నేరాలు చేసి లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నాడని సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. దీనికి సంబంధించి నెట్వర్క్ బిల్డప్ చేసుకున్నాడని, మూడు రాష్ట్రాల్లో ఇతను నేరాలు చేయాలని అనుకున్నాడన్నారు. ఇతని అరెస్టుతో మూడు రాష్ట్రాల్లో వీరు చేయాలనుకున్న పెద్దనేరానికి అడ్డుకట్ట వేశామని, తుపాకులను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీపీ సుధీర్‌ బాబు తెలిపారు.

Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

Exit mobile version