NTV Telugu Site icon

Punjab: కాలుతున్న చితిలోకి దూకిన ఓ వ్యక్తి.. పరిస్థితి విషమం

Punjab

Punjab

పంజాబ్లోని జలంధర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జండియాల మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలిపోతున్న చితిలోకి దూకాడు. దీంతో.. అతనికి మంటలు అంటుకుని 70 శాతం కాలాయి. ఆ వ్యక్తిని జండియాలా మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ (50)గా గుర్తించారు.

Read Also: Heart transplant: ‘‘ఆ గుండె వేగం ఎంతంటే 13 నిమిషాల్లో 18 కి.మీ.’’..

ఈ ఘటనపై సమాచారం మేరకు గ్రామస్తులు కాలిపోతున్న చితిలో నుంచి అతి కష్టం మీద అతన్ని బయటకు తీసి సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. బహదూర్ సింగ్ మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న గ్రామానికి చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బహదూర్ సింగ్ ఆమె అంత్యక్రియలకు వెళ్లాడు. అకస్మాత్తుగా మండుతున్న మంటల్లోకి ఎందుకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Paris Olympics : పేరు గొప్ప ఊరు దిబ్బ.. పారిస్‌లో అథ్లెట్స్‌కు చాలి చాలని రూమ్‌లు..!