NTV Telugu Site icon

Andhrapradesh: మద్యం మత్తులో బాంబును నోటితో కొరికిన వ్యక్తి మృతి

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొంత మంది మద్యానికి బానిసై తమ కుటుంబాలను రోడ్డుకు మీదకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికి ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి రాత్రి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన చిరంజీవితో అతని భార్య గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో బాంబును కొరకడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.