NTV Telugu Site icon

Passenger Died: ఆరోగ్యం క్షీణించి బస్సులో ప్రయాణికుడు మృతి..

Bus Died

Bus Died

ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్యం శుక్రవారం క్షీణించింది. దీంతో బస్సు డ్రైవర్‌ ఆ ప్రయాణికుడిని భవాలీ సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Read Also: Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్

మృతుడి కుమారుడు భీమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు జమ్మూలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తన తండ్రి ప్రేమ్ కుమార్ అని చెప్పాడు. అయితే.. మృతుడు శుక్రవారం ఉదయం కౌసాని కేము బస్సులో హల్ద్వాని నుండి తన ఇంటికి వెళ్తున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు గెథియాకు చేరుకోగానే సోదరుడితో ఫోన్‌లో మాట్లాడి బస్సులో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉన్న అతడిని భవాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే అతను మృతి చెందినట్లు మెడికల్ ఇన్ చార్జి డాక్టర్ రమేష్ కుమార్ తెలిపారు.

EC: జమ్మూ కాశ్మీర్‌లో ఈసీ పర్యటన..తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన

ప్రాథమికంగా ఆ వ్యక్తి మృతికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి, సోదరుడు.. సోదరీమణులు జమ్మూలో నివసిస్తున్నారు.

Show comments