Site icon NTV Telugu

Formula E-Car Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కొత్త ట్విస్ట్..

E Car Race

E Car Race

ఫార్ములా-ఈ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన అంశాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో నుంచి భారీగా ఎన్నికల బాండ్లు అందినట్లు తెలిపింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు బీఆర్ఎస్‌ పార్టీకి ఎన్నికల బాండ్లు అందాయని.. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని వెల్లడించింది. ప్రతిసారి రూ. కోటి విలువ చేసే బాండ్ల కొనుగోలు చేసినట్లు చెప్పింది. మొత్తంమీద రూ.41 కోట్లను బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం తెలిపింది.

Exit mobile version