NTV Telugu Site icon

Nitrogen Death: అమెరికాలో సరికొత్త మరణశిక్ష.. నైట్రోజన్‌తో 7 నిమిషాల్లోనే..!

America

America

వాషింగ్టన్: ప్రపంచంలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఖైదీకి వినూత్న రీతిలో మరణశిక్ష అమలకు అమెరికా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణశిక్ష అమలు చేసింది. హత్య కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. స్మిత్‌కి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని అమెరికాలోని అలబామా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు అధికారులు నైట్రోజన్‌ గ్యాస్ ఉపయోగించి స్మిత్‌కు మరణశిక్ష అమలు చేశారు. నైట్రోజన్ సిలిండర్‌కు అమర్చిన పైపును మాస్క్ ద్వారా స్మిత్‌ ముక్కుకు బిగించి గ్యాస్‌ను విడుదల చేశారు. ఆక్సిజన్ స్థానంలో నైట్రోజన్ పీల్చి 7 నిమిషాల్లోనే స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు.

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదు.. నేతలకు సూచన

1988లో బీమా డబ్బుల కోసం తన భార్యను స్మిత్ హత్య చేశాడు. అప్పుల బారినుంచి బయటపడేందుకు కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ కేసులో 1996లో స్మిత్‌కు మరణశిక్ష పడింది. 2022లోనే ఇంజక్షన్ ద్వారా స్మిత్‌కు మరణశిక్ష విధించాలని ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు స్మిత్‌కు నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి ప్రాణాలు తీశారు.

Gyanvapi Case: శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, తెలుగు శాసనాలు.. జ్ఞానవాపి మసీదు ఏఎస్ఐ సర్వేలో కీలక విషయాలు..

నైట్రోజన్ గ్యాస్‌తో ప్రాణాలు తీయడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ విధానం హింసాత్మకమని పేర్కొంది. అలాగే చివరి వరకు ఈ మరణాన్ని ఆపేందుకు స్మిత్ తరపు న్యాయవాదులు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అలబామా న్యాయస్థానం చూసించినట్టుగానే స్మిత్‌కు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించింది.