NTV Telugu Site icon

Wayanad Landslide: విపత్తుతో పోరాడి నెలన్నర పసికందు, ఆరేళ్ల బాలుడిని రక్షించిన తల్లి

Wayanad

Wayanad

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు. రెస్క్యూ టీమ్ ప్రకారం.. అనారా, హయాన్‌లను రక్షించడానికి వారి తల్లి తంజీరా తన ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడుకుంది. వరదల ధాటికి ఓ ఇంటి పైకప్పు పైకి వెళ్లి రక్షించింది. అకస్మాత్తుగా వరద ప్రవాహం ఎక్కువ అవడంతో హయాన్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అదృష్టవ శాత్తు.. హయాన్‌ 100 మీటర్ల దూరం వెళ్లి బావి పక్కనే ఉన్న తీగకు చిక్కుకుపోయాడు. దీంతో.. రెస్క్యూ టీమ్ అతన్ని కాపాడింది. పిల్లలిద్దరూ క్షేమంగా ఉండడంతో తల్లి తంజీరా ఆనందానికి అవధులు లేవు. అయితే తన తల్లి అమీనా, అమ్మమ్మ పాతుమ్మను కోల్పోయింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ‘‘జగన్నాథ రథయాత్ర’’ .. వేలాది మంది హాజరైన వీడియో వైరల్..

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 308 మంది మరణించారు
మృతుల సంఖ్య 308కి చేరింది. ప్రస్తుతం దాదాపు 250 మంది గల్లంతైనట్లు సమాచారం. రిలీఫ్ మరియు రెస్క్యూ వర్కర్లు ప్రస్తుతం శిథిలాలలో ప్రాణాలతో ఉన్నవారి కోసం.. అలాగే మృతదేహాల కోసం వెతకడంలో బిజీగా ఉన్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరగవచ్చు. ముండక్కై, చురలమల, అట్టమల, నూలప్పుజ గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఎంత మంది ప్రభావితమయ్యారో అంచనా వేయడం ప్రభుత్వాన్నికి కష్టంగా మారింది.

అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయని.. దీంతో తక్కువ సమయంలోనే అధిక వర్షం కురుస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ మార్పు మరింత విపత్తుగా మారుతుందని వాతావరణ నమూనాలు కూడా అంచనా వేస్తున్నాయి. గత 100 ఏళ్లలో వర్షపాతం తీరు గతంలో కంటే ఎక్కువగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి.

Read Also: Tips To Uses Of Silica Gel: వావ్‌.. ఈ తెల్లటి ప్యాకెట్లు మీకు కనిపించాయా..? ఇలా చేయండి..