NTV Telugu Site icon

Monkey Attack: నదిలో స్నానం చేస్తున్న జంటపై కోతి దాడి.. యువతి ఏం చేసిందో తెలుసా..!

Monkey

Monkey

జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియోలో ఒక జంట నదిలో కలిసి స్నానం చేస్తుండగా.. ఉన్నట్టుండి ఓ కోతి వారి దగ్గరికి వచ్చింది. అయితే వారిద్దరు కలిసి స్నానం చేయడం ఆ కోతికి నచ్చలేదేమో. అందులో నుంచి వెళ్లేదాకా వదల్లేదు.

Read Also: Shahid Afridi: టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

ఈ వీడియోలో.. ఓ జంట నదిలో స్నానం చేస్తున్నట్లు చూడవచ్చు. వారు స్నానం చేస్తుండగా ఒక కోతి అక్కడికి వచ్చి వారిని భయపెట్టిస్తుంటుంది. అది చూసిన ఆ అమ్మాయి.. కోతిపైకి నీరు విసురుతుంది. అయితే వెంటనే కోతికి కోపం వచ్చి మెట్లు దిగడం ప్రారంభిస్తుంది. కోతి దగ్గరికి రావడం చూసి ఆ అమ్మాయి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ యువకుడు నదిలోనే నిలబడి ఉంటాడు.

Read Also: Hyderabad: మైనర్‌ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్‌ కానిస్టేబుల్‌

అయితే ఆ కోతి నుండి ఎలాగోలా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. యువకుడు నదిలో నుంచి వెళ్లడం చూసి కోతి నదిలోకి దూకుతుంది. ఆ తర్వాత యువకుడి చేయి పట్టి కొరుకుతుంది. వెంటనే యువకుడు నీళ్లలో నుంచి బయటకు వచ్చి భయపడి పరుగెత్తుతాడు. అయినప్పటికీ ఆ కోతి అతన్ని వదలలేదు. ఆ కోతికి ఇంతకుముందు ఏం అన్యాయం చేశాడో తెలియదు కానీ.. ఏదో పగబట్టినట్లే నిన్ను వదిలేది లేదన్నట్లుగా యువకుడి వెంటే పడింది కోతి. అయితే ఈ వీడియో చూసిను నెటిజన్లు చాలా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై చాలా కామెంట్స్ చేస్తున్నారు.

Show comments