NTV Telugu Site icon

Suicide: వివాహిత ప్రాణం తీసిన మిస్డ్ కాల్

Women Suside

Women Suside

ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆనందంగా సాగుతున్న జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. రత్నాల్లాంటి పిల్లలను కాదనుకొని పర స్రీ లేదా పురుషుడి మోజులో పడి కొందరు తమ దాంపత్య జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాలు పచ్చగా సాగుతున్న సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యా, భర్త ఏ ఒక్కరి విషయంలోనై అక్రమ సంబంధం బయటపడితే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.

Read Also: Cigarette Lighters Ban: సిగరెట్ తాగేవారికి షాక్..రూ.20 లైటర్ దిగుమతిపై ప్రభుత్వం నిషేధం

తాజాగా వరంగల్‌ జిల్లాలో ఓ మిస్డ్ కాల్ వ్యవహారం వివాహిత ప్రాణం తీసింది. వరంగల్ పట్టణంలోని కరీమాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న వివాహిత ఆకుతోట సౌజన్య గత కొన్ని నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ రావడంతో ఆ మిస్ కాల్ కి రిప్లై ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తితో మాట్లాడుకుంటూ పరిచయం ఏర్పరచుకుంది.

Read Also: Haryana Cop Arrest: కోట్ల చలాన్ స్వాహా.. పోలీసునే అరెస్ట్ చేసిన పోలీసులు

అయితే, కొద్దిరోజుల తర్వాత తన కోరిక తీర్చమని సదరు మహిళను తిరుపతి వేధించసాగాడు. వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది. ఆమె కుటుంభసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.