NTV Telugu Site icon

Minor Girl: అత్యాచారం.. ఛాతీపై బ్లేడుతో పేరు.. అబ్బా.. ఏమని చెప్పాలి వీడి ఆగడాలు

Harrasment

Harrasment

Minor Girl: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ఆ అమ్మాయి ఛాతీపై నిందితుడు బ్లేడుతో పేరు చెక్కారు. అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ కూడా చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గ్వాల్టోలి ప్రాంతంలో కలకలం రేగింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఆమె ఉంటున్న ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ వలలో పడేశాడు. అంతేకాదు బ్లేడ్ ఛాతిపై తన పేరు రాశాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోతే గొంతు కోస్తానని బ్లేడ్‌తో బెదిరించాడు. చిత్రహింసలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడంతో ఆమె భయపడింది.

Read Also: Punjab: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్‌కు సిద్ధం.. పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సస్పెండ్..

దీంతో భయపడిన మైనర్ బాలిక అక్క పెళ్లికోసం తండ్రి దాచిన పదిన్నర లక్షల రూపాయలను తీసుకెళ్లి వాడికి ఇచ్చింది. ఈ క్రమంలోనే తన అక్కకు పెళ్లి కుదిరింది. తండ్రి దాచిన డబ్బులతో పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాడు. సమయం రానే వచ్చింది. పెళ్లి సమయంలో అందరూ హడావుడిలో ఉండగా ఖర్చుల నిమిత్తం అల్మారాలో దాచిన డబ్బులకోసం ఓపెన్ చేశాడు. బీరువాలో డబ్బులు లేకపోవడంతో షాకయ్యాడు. తండ్రి కాళ్లకింద భూమి కదిలింది. ఇంట్లో అందరిని పిలిచి విచారణ చేపట్టాడు. ఆ తర్వాత తన చిన్న కూతురుని అడగ్గా మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది.

Read Also : Harrasment : నాకు ప్రమోషన్ కావాలి.. నువ్వు మా బాస్ పక్కలో పడుకోవాలి

బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అమన్ అనే అబ్బాయి తనను ప్రేమ ఉచ్చులోకి లాగాడని బాలిక పోలీసులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి మంగళసూత్రాన్ని కూడా తెమ్మని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేందేం లేక తల్లి మంగళసూత్రాన్ని దొంగిలించి అమన్‌కి ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఇంకా డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ మొత్తం కేసులో అమన్ స్నేహితులు కూడా ఉన్నారు, వీడియో వైరల్ అవుతుందనే భయంతో ఆమె నిందితుడికి ఇప్పటి వరకు చాలా సొమ్ము అప్పజెప్పినట్లు పేర్కొంది. బాధితురాలి అభ్యర్థన మేరకు పోలీసులు నిందితుడు అమన్‌, అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Show comments