Site icon NTV Telugu

K Laxman: ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..

Laxman

Laxman

నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆర్థికంగా భారం పడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకు ఆరు నెలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కోసం మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించేలా అన్ని పార్టీలతో అందరితో చర్చలు జరుపుతామని లక్ష్మణ్ వెల్లడించారు.

READ MORE: Sam Altman: శామ్‌ ఆల్ట్‌మన్‌పై సోదరి సంచలన ఆరోపణలు.. పదేళ్ల పాటు లైంగికంగా వేధించాడని వెల్లడి

కాగా.. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో గందరగోళం మధ్య జేఏసీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. కమిటీ ఛైర్మన్ పీపీ ఛౌధురి అధ్యక్షతన జరుగుతోంది. కమిటీలో సభ్యులుగా లోక్ సభ, రాజ్యసభ నుంచి మొత్తం 39 మంది ఎంపీలు ఉన్నారు. నేటి సమావేశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరవుతారు.

READ MORE: Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని

Exit mobile version