Indian MBBS Student: వియత్నాంలో తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మృతి..!
- వియత్నాంలోని కాన్ థో నగరంలో భారతీయ విద్యార్థి మృతి.
- మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్‌గా గుర్తింపు.
- ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న అర్షిద్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian MBBS Student: ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్‌గా అక్కడి అధికారులు గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో అర్షిద్ నడిపిన బైకు వేగంగా రావడంతో అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ ప్రమాద సమయంలో అతనితోపాటు ఉన్న అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వేగంగా వెళుతుందని, అదుపుతప్పి నేరుగా గోడను ఢీకొనడంతో ఇద్దరూ పైకి ఎగిరి పడిన దృశ్యాలు దగ్గరలోని సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మొదట ఓ ప్రశ్నతంగా ఉన్న వీధి కనిపిస్తుంది. అలా ఉన్న సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బైకు గోడను చాలా గట్టిగా గుద్దుతుంది. ఢీకొట్టే వేగం ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఢీ కొట్టిన తర్వాత ఇద్దరూ గాల్లోకి ఎగిరిపోతూ కనిపించారు.
Read Also: Sharmishta Panoli: ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు..!
ఇకపోతే మృతి చెందిన అర్షిద్ తల్లిదండ్రులు అర్జున్, ప్రతిమలు ఆసిఫాబాద్‌లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు స్పందించారు. మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగంగా జరగాలంటూ విజ్ఞప్తి చేశారు.
A medical student from Telangana died in an accident in Vietnam's Can Tho City on Tuesday, June 3.
The deceased was identified as 21-year-old Arshid Ashrit, a native of KumaramBheem Asifabad. The accident occurred when Arshid was riding a bike at a high speed along with his… pic.twitter.com/FrJlZBrff6
— The Siasat Daily (@TheSiasatDaily) June 5, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!