Site icon NTV Telugu

Noida: బీహార్ లో చనిపోయి.. నోయిడాలో బిచ్చగాడిగా మారిన వ్యక్తి..

Noida

Noida

బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో కనిపించకుండా పోయాడు. అయితే సదరు వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టా్ల్ లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు అనుకున్నారు. అయితే అతను.. జనవరి 31వ తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా మిస్సైయ్యాడు. దీంతో అతని బావమరిది రవిశంకర్ సింగ్ సుల్తాన్ గంజ్ పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే నిశాంత్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం బావమరిదే అతడిని కిడ్నాప్ చేశాడని ఆరోపించారు.

Also Read : #VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ

అయితే చనిపోయాడనుకున్న సదరు వ్యక్తిని నాలుగు నెలల తర్వాత.. నోయిడాలోని సెక్టార్ 50లో ఒక మోమోస్ స్టాల్ దగ్గర.. బిచ్చగాడిలా ఆహారం కోసం వేడుకుంటున్న వ్యక్తిని రవిశంకర్ గమనించాడు. దీంతో అతడినికి ఆహారం ఇవ్వాలని దుకాణం యాజమానితో వాగ్వాదానికి దిగారు. ఆహారం తీసుకున్న తరువాత రవిశంకర్ సింగ్ అతని గురించి ఆరా తీశాడు. అప్పుడతను తాను బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని నౌగాచియాకు చెందిన వ్యక్తి అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి తన పేరు నిశాంత్ కుమార్ అని, మాజీ బ్యాంక్ ఉద్యోగి సచ్చిదానంద సింగ్ కొడుకు అని చెప్పాడు.

Also Read : Tamannah: బాహుబలి సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా…?

దీంతో వెంటనే రవిశంకర్ సింగ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి అతను చెప్పింది అంతా విన్నారు..బీహార్‌లోని అతని స్నేహితులు, కుటుంబీకులను సంప్రదించారు. ఆ తరువాత ఆ వ్యక్తి తప్పిపోయి నెలలు గడుస్తున్నాయని తెలుసుకున్నారు. తరువాత రవిశంకర్ సింగ్ ఆ వ్యక్తి ఫోటోను కూడా కుటుంబ సభ్యులకు పంపించారు.

Also Read : Varun Tej-Lavanya Tripati : లావణ్య,వరుణ్ లు పెళ్లికి ముందే ఆ పనికి అగ్రిమెంట్ చేసుకున్నారా?

తనపై వచ్చిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని రవిశంకర్ చెప్పారు. కొన్ని నెలల క్రితం అతను కనిపించకుండా పోవడంతో.. అతను చనిపోయాడని అతని మామయ్య పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో తాను అనేక రకాల చిత్రహింసలు ఎదుర్కున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిశాంత్ కుమార్ మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో అతనికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. నిశాంత్ కుమార్ బీహార్ నుండి నోయిడాకు ఎలా చేరుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా భాగల్‌పూర్‌కు అతన్ని తీసుకెళ్లారు.

Exit mobile version