Site icon NTV Telugu

Smuggle Cocaine: అచ్చం సినిమాలో లాగే.. వ్యక్తి కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్ స్మగ్లింగ్..!

6

6

ఓ వ్యకి తన కడుపులో 74 క్యాప్సూల్స్‌లో దాచిపెట్టి రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన సియర్రా లియోన్ దేశస్థుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 1,108 గ్రాముల బరువున్న డ్రగ్ క్యాప్సూల్స్‌ ను ప్రయాణికుడి శరీరం నుంచి శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రి వైద్యులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also read: Sivananda Reddy: ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. అరెస్ట్‌ భయంతో పరార్‌..!

ఇక పోలీసుల నిర్దిష్ట సమాచారం ఆధారంగా.., సియెర్రా లియోన్ జాతీయుడిని మార్చి 28న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) వద్ద DRI బృందం పట్టుకున్నట్లు స్మగ్లింగ్ నిరోధక ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ సందర్భంగా, నిషేధిత మాదక ద్రవ్యాన్ని భారత్‌ కు తరలించే ప్రయత్నంలో కొకైన్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు ఆ వ్యక్తి DRI అధికారులకు చెప్పాడు.

Also read: Thomas Isaac: రూ. 9.6 లక్షల విలువైన 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదు..

కోర్టు ఆదేశాల మేరకు జేజే ఆస్పత్రిలో సదరు వ్యక్తిని చేర్పించారు. వైద్యుల బృందం అతని పొత్తికడుపు నుండి ఏకంగా 74 కొకైన్ క్యాప్సూల్స్‌ ను తొలగించినట్లు అధికారి తెలిపారు.ఆ వ్యక్తిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ప్రకటన తెలిపింది. ముంబై విమానాశ్రయంలో కొకైన్‌ తో పట్టుబడిన సియెర్రా లియోన్ జాతీయుడికి సంబంధించిన వారంలో ఇది రెండవ కేసు. మార్చి 24న, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక మహిళ ₹ 19.79 కోట్ల విలువైన 1,979 గ్రాముల కొకైన్‌ తో అరెస్టు చేయబడింది. ఆమె షూస్, మాయిశ్చరైజర్, షాంపూ బాటిల్స్, యాంటీపెర్స్పిరెంట్స్‌ లలో డ్రగ్‌ ను దాచిపెట్టింది.

Exit mobile version