సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన జనాలు నువ్వు గ్రేటా రా బుజ్జా, వీడు మాములోడు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. చంద్రమోహన్ మృతి మరువక ముందే నిర్మాత మృతి!
ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన బైక్‌పై ఎద్దును ముందు కూర్చోపెట్టుకుని నడుపుతున్నాడు. పెద్ద కొమ్ములున్న ఎద్దు కూడా ఎటు కదలకుండా ముందు కూర్చుని చూస్తోంది. మాములుగా ఏదైనా పెద్ద వాహనంలో ఎక్కిస్తే.. అటు ఇటు కదిలే ఎద్దు. ఇక్కడ మాత్రం ఏం చక్కా దర్జాగా కూర్చుంది. ఈ ఫన్నీ సీన్‌ని ఓ కారు డ్రైవర్ తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో నైజీరియాకు చెందినదిగా కొందరు వ్యక్తులు చెబుతున్నారు. అక్కడి వారైతేనే ఇలాంటి వింత పనులు చేస్తారని అంటున్నారు.
Read Also: Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్
ఈ వీడియోను ట్విట్టర్‌లో @nareshbahrain అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 93 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. దీన్నే బుల్ రన్ అంటారని చెప్పాడు. మరొకరేమో.. ప్రపంచం చాలా భిన్నమైనది.. ఎవరూ ఊహించని నైపుణ్యాలతో నిండి ఉంది అని కామెంట్ చేశాడు.
This is how you ride the BULL in a rally. 😉#nifty50 #StockmarketIndia pic.twitter.com/J1jpEkk4EM
— Naresh Nambisan | നരേഷ് 🧘♂️ (@nareshbahrain) November 10, 2023