NTV Telugu Site icon

Attack In Hospital: ఆసుపత్రిలో ప్రవేశించి విచక్షణారహితంగా దాడి.. ముగ్గురు మృతి.. ఆరుగురుకి గాయలు

Attack

Attack

Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ఆరుగురిలో ఒక పోలీసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Koti Deepotsavam 2024: కార్తీక పూర్ణిమ శుభవేళ.. కోటి దీపోత్సవంలో ఏడవ రోజు కార్యక్రమాలు ఇవే!

నికమ్ సాంగ్‌బియా అనే వ్యక్తి ఉదయం 11.30 గంటలకు సెపా సివిల్ ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేయడం ప్రారంభించాడని తూర్పు కమెంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె సికోమ్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిపై దాడికి పాల్పడిన వ్యక్తి మొదట దాడికి పాల్పడ్డాడని, ఆపై ఇతరులపై దాడి చేయడం ప్రారంభించాడని ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన వారిలో దాడి చేసిన వ్యక్తి భార్య తాడే సాంగ్‌బియా, కుమార్తె నకియా సాంగ్‌బియా, మరోవ్యక్తి పసా వెలి కూడా ఉన్నారని ఆయన చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోలీసు అధికారి మిన్లీ గయి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స కోసం ఇటానగర్‌కు తరలించారు. అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Read Also: Cash Transaction: క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇష్టమొచ్చి నట్టు చేస్తున్నారా? వారికి ఆటోమెటిక్‌గా వివరాలు..