Hair Transplant : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎంతపని చేసింది.. బట్టతల పోతుందని ఆపరేషన్ చేయించుకుంటే ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఇటీవల కాలంలో బట్టతల అనేది పురుషుల్లో ప్రధాన సమస్యగా మారింది. జన్యులోపాలు తదితర కారణాలతో చిన్న వయసులోనే పురుషులకు బట్టతల వస్తోంది. దీంతో వారు సమాజంలో కాన్ఫిడెంట్ గా జీవించలేకపోతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ఈ క్రమంలో జుట్టుకోసం ఎంతైనా ఖర్చుకు వెనకాడడం లేదు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న వైద్యశాలలు భారీగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీకి భారీగా నగదు వసూలు చేస్తున్నాయి.
Read Also: Woman Drinker : దేంట్లో మేం తక్కువ.. తాగుతాం.. తాళాలు పగలకొడతాం
హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కారణంగా ఢిల్లీలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మీడియా ఎగ్జిక్యుటివ్‌గా పని చేసే ముప్పై ఏళ్ల రషీద్.. సర్జరీ కోసం ఎదురు చూస్తున్నాడు. బట్ట తల కారణంగా తనకు సరైన ఆత్మ విశ్వాసం ఉండేది కాదు. పెళ్లి కూడా కావడం లేదు. దీంతో ఎలాగైనా సరే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించాలనుకున్నాడు. చాలామంది డాక్టర్లను అడగ్గా.. ఈ ప్రక్రియకు రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో.. ఆఫర్ల కోసం ఎదురు చూశాడు. దీంతో మంచి ఆఫర్ అతడిని వెతుక్కుంటూ వచ్చింది. రూ.పదిహేను వేలకే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తారని తెలిసి అనుభవం లేని క్లినిక్‌లో సంప్రదించాడు.
Read Also: Double Decker Buses : గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు
యూట్యూబ్‌లో వీడియోలను చూసి సొంతంగా శిక్షణ పొందిన వారితో నిర్వహించబడుతున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్‌లో సర్జరీ చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతను గతేడాది ఢిల్లీలోని ఒక ప్రైవేట్ క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను పలు సార్లు ఈ చికిత్స కోసం వచ్చాడు. అయితే అతని తల నుంచి వాపు ఎక్కువ అయ్యి విపరీతమైన నొప్పి వచ్చేది. అలా రాను రాను అనారోగ్యానికి గురై చివరికి ప్రాణాలు విడిచాడు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్జరీ చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.