NTV Telugu Site icon

Viral: భార్య ఎక్కిన విమానం రావడం ఆలస్యం.. వారందరికి షాక్ ఇచ్చిన భర్త

Indigo

Indigo

భారత విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైలట్ అలసిపోవడం వల్ల తన భార్య రావాల్సిన విమానం దాదాపు మూడు గంటల పాటు ఆలస్యమైందని అతడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించి తన భార్యతో చేసిన వాట్సప్ చాటింగ్‌ను సైతం అతడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్స్ నెట్టింట వైరలయ్యాయి. ఇక దీనిపై చివరికి ఇండిగో విమానం స్పందించింది.

Read Also: Ajay Devgn: 45 కోట్లతో కొత్త ప్లాట్.. అజయ్‌ దేవగన్‌ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారో తెలుస్తే షాక్

ఆదివారం రోజు డెహ్రడూన్-చెన్నై విమానంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమీర్ మోహన్ అనే వ్యక్తి తన భార్యకు కలిగిన అసౌర్యం గురించి సోషల్ మీడియాలో వెల్లడించి.. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖకు ట్యాగ్ చేశాడు. పైలట్ అలసిపోయారని.. అయితే అతని స్థానంలో మరో పైలట్‌ను భర్తీ చేసేందుకు అవకాశం లేనందువల్లే ఇలాంటి సంఘటన జరిగినట్లు అతని ట్వీట్ లో తెలిపాడు.

Read Also: Indian Plyers: కరీబియన్ దీవిలో టీమిండియా ప్లేయర్స్ రచ్చ రచ్చ.. బీచ్ లో హల్ చల్

అలాగే ఆ విమానంలో ప్రయాణించిన మరో వ్యక్తి కూడా అందులోని వీడియోలను కూడా షేర్ చేశాడు. పైలట్స్ విమానాన్ని ఢిల్లీలో ల్యాండ్ చేశారని.. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారని చెప్పుకొచ్చాడు. సిబ్బంది చాలా అలసిపోయి ఉన్నారని.. విమానాల నిర్వహణకు సంబంధించి ఇండిగోపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత దీనిపై స్పందించిన ఇండిగో ఆలస్యం వల్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. షెడ్యూల్ సమస్యల వల్లే ఈ ఆలస్యం జరిగిందని ఇండిగో తెలిపింది. ఈ సమయంలో ఓపికగా ఉన్నందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు అని వెల్లడించింది.