Marriage Cheater: పోలీసును అంటూ.. ఐదుగురితో వివాహం.. మరో 50 మందితో..
- ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెళ్లి మోసానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం.
- ఓ వ్యక్తి ఐదుగురు మహిళలను తన మాటలతో మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు.
- నిందితుడిని 34 ఏళ్ల సత్యజిత్ సమాల్‌గా గుర్తించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Cheater: మ్యాట్రిమోనియల్ సైట్‌లలో మోసానికి సంబంధించిన అనేక కథనాలను ఈమధ్య కాలంలో తరుచుగా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెళ్లి మోసానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఐదుగురు మహిళలను తన మాటలతో మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లి కోసం దాదాపు 50 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని 34 ఏళ్ల సత్యజిత్ సమాల్‌గా గుర్తించారు. పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. అతని వద్ద నుంచి కారు, బైక్, రూ. 2.10 లక్షలు, పిస్టల్, పెళ్లి ఒప్పందాలు స్వాధీనం చేసుకున్నారు.
Film Fare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘చిన్నా’ హవా.. ఏకంగా 7 అవార్డులు!
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
భువనేశ్వర్ – కటక్ పోలీస్ కమిషనర్ సంజీవ్ పాండా మాట్లాడుతూ.. ఇద్దరు మహిళల నుండి వేర్వేరు ఫిర్యాదులు అందడంతో ఒక మహిళా అధికారి నేతృత్వంలో పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణ కారణంగా నిందితుడిని అరెస్టు చేయగలిగారు. విచారణలో ఆ ఇద్దరు మహిళలను తాను పెళ్లి చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతని 5 మంది భార్యలు ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. 5 మందిలో అతని నలుగురు భార్యల గురించి పోలీసులు తెలుసుకున్నారు. అయితే, ఐదవ భార్య గురించి ఇంకా సమాచారం అందుబాటులో లేదు. నిందితుడి మూడు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అతను ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందినవాడు. కానీ., ప్రస్తుతం భువనేశ్వర్‌లో నివసిస్తున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నగదు, బైక్, కారు డిమాండ్ చేసేవాడు.
Sunday Stotram: ఈ అభిషేకం తప్పక వీక్షిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..
మహిళలు డబ్బులు తిరిగి అడిగితే పిస్టల్‌తో బెదిరించేవాడు. అతడి మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు మ్యాట్రిమోనియల్ సైట్‌లో 50 మంది మహిళలతో చాటింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఫిబ్రవరిలో రాజధాని పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు ఫిర్యాదుదారులలో ఒకరి ప్రకారం, ఆమెకు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సత్యజిత్ సమాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రెగ్యులర్ గా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొద్దిరోజులు మాట్లాడుకున్న తర్వాత కలవడం మొదలుపెట్టారు. పెళ్లి సాకుతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, కారు కొనేందుకు డబ్బులు అడిగాడు. బాధితుడు బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుని రూ. 8.15 లక్షల విలువైన కారును కొనుగోలు చేశాడు. దీని తర్వాత వ్యాపారం చేసేందుకు రూ.36 లక్షలు కూడా ఇచ్చారు. రెండో ఫిర్యాదుదారుడి నుంచి నిందితులు రూ.8.60 లక్షలు, బైక్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!