NTV Telugu Site icon

Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!

Suicide Case

Suicide Case

committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్‌ కుంజ్‌లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్‌పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పిల్లల తల్లి ఇదివరకే క్యాన్సర్‌తో మరణించింది. శుక్రవారం అర్థరాత్రి పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. కుమార్తెలు వికలాంగులు కావడంతో తండ్రి ఈ చర్య తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు

సమాచారం ప్రకారం, రంగపురి గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న తండ్రి వయస్సు సుమారు 46 సంవత్సరాలు. వీరు బీహార్‌ లోని ఛప్రా జిల్లా నివాసి. వారికి నలుగురు కుమార్తెలు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పెంటర్‌గా పనిచేశాడు. శుక్రవారం సాయంత్రం వారి ఫ్లోర్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జరిగిన విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేయడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు.

Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..

మృతి చెందిన తండ్రి హీరాలాల్ శర్మ(46)గా గుర్తించారు. అతని నలుగురు కుమార్తెల వయస్సు 20 – 26 సంవత్సరాల మధ్య ఉంది. హీరాలాల్ గత 28 సంవత్సరాలుగా వసంత్ కుంజ్‌లోని ఇండియన్ స్పైనల్ ఇంజూరీ సెంటర్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. 2024 జనవరి నుంచి డ్యూటీకి వెళ్లడం లేదని సమాచారం. అంతేకాదు, అతని ఇద్దరు కూతుళ్లు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు పాక్షికంగా వికలాంగులయ్యారు. హీరాలాల్ తన కూతుళ్లకు ఏదో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయడంలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. కుమార్తెలు చాలా అరుదుగా తమ గదుల నుండి బయటకు వచ్చే వారు. ఇంట్లో నుంచి మూడు ప్యాకెట్ల విషం, ఐదు గ్లాసుల్లో అనుమానాస్పద ద్రవం, ఒక చెంచా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.