Site icon NTV Telugu

Hyderabad: రాజేంద్రనగర్‌లో చిరుత పులి కలకలం..

Leopard

Leopard

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూశారు. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు.ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు.

READ MORE: Private Travels: 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు..

రాజేంద్రనగర్‌ నగర్‌లో చిరుత కనిపించడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా చాలా సార్లు కనిపించింది. 2020లో హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ దగ్గర ఆవులపై దాడి చేసింది. ఒక ఆవు దూడను పట్టి చంపి తింటున్న దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. యజమాని తన ఆవులని కాపాడుకునేందుకు డప్పు శబ్ధం చేయడంతో చిరుతపులి పారిపోయింది. ప‌లుమార్లు చిరుత పులులు తిరుగుతున్నప్పటికీ అధికారులు ప‌ట్టించుకోవ‌డంలోద‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏ స‌మ‌యంలో చిరుత దాడి చేస్తుందోన‌ని భ‌యాందోళ‌న‌లో ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత ప్రత్యక్షం కావడంతో మరోసారి స్థానికుల్లో భయం మొదలైంది.

READ MORE: Daaku Maharaj: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్వూ

Exit mobile version