NTV Telugu Site icon

Mahakumbh 2025 : ‘భారత్ చాలా గొప్పది’.. సనాతన ధర్మాన్ని కొనియాడిన విదేశీ భక్తులు (వీడియోలు)

Mahakumbh

Mahakumbh

మహాకుంభమేళా 2025 ఈరోజు నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. సంగం ఒడ్డుకు భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి ‘షాహి స్నాన్’ నిర్వహిస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అరుదైన ఖగోళ యాదృచ్చికానికి సంబంధించి భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ మహాకుంభానికి 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. కాగా.. ఇక్కడి వచ్చిన విదేశీ భక్తుల మాటలకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను వారు కొనియాడుతున్నారు.

ఈ మేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావడం పట్ల విదేశీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ దివ్యత్వాన్ని చూసి, ఒక రష్యన్ భక్తురాలు భారతదేశాన్ని కొనియాడింది. మేరా భారత్‌ మహాన్ అనే స్లోగన్ ఇచ్చింది. “మేము మొదటిసారి కుంభమేళాకి వచ్చాం. ఇక్కడ మనం నిజమైన భారతదేశాన్ని చూడాలి. ఈ పవిత్ర స్థలానికి ఉన్న శక్తితో నేను వణికిపోతున్నాను. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.” అని ఆమె తెలిపింది.

ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి వచ్చిన ఓ భక్తుడు పరిశుభ్రత, ఏర్పాట్లను కొనియాడారు. “రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తాం. ఇక్కడికి రావడం ద్వారా మేము పొందిన అనుభవం మరువలేనిది.” అని తెలిపాడు.

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి మహాకుంభమేళాకి వచ్చిన నిక్కీ అనే భక్తురాలు ఇక్కడి అద్భుతమైన వాతావరణాన్ని చూసి మురిసిపోయింది. తన భావాలను పంచుకుంటూ ఈ అనుభవం చాలా పవర్ ఫుల్ అని తెలిపింది. గంగా నది వద్దకు రావడం ఆశీర్వాదంగా.. అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.

అదే సమయంలో కుంభ్ చేరుకున్న స్పానిష్ భక్తుడు చాలా మంది స్నేహితులు ఇక్కడికి వచ్చారని చెప్పారు. స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్ నుంచి చాలా మంది వచ్చినట్లు పేర్కొన్నారు. తాము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నట్లు తెలిపారు. తాను పవిత్ర స్నానం చేశానని.. పూర్తిగా ఆస్వాదించానన్నారు. నన్ను నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను అని తెలిపాడు.

Show comments