NTV Telugu Site icon

Formula E-Car Race Case: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం..

Formula E Car Race Case

Formula E Car Race Case

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు బీఎల్ఎన్ రెడ్డి, రేపు అరవిందకుమార్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. వారు హాజరు కాకుండా మరింత సమయం కావాలని కోరారు. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సహా హాజరు కావాలని చెప్పడంతో తమకు మూడు వారాలు గడువు కావాలని కోరినా అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఈ నెల 8,9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా రావాలని కోరింది. ఈ క్రమంలో.. ఈనెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది.

Read Also: Maharashtra: చనిపోయాడని డిక్లేర్ చేసి ఆస్పత్రి.. ‘‘స్పీడ్ బ్రేకర్’’ ప్రాణాలను రక్షించింది..

ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో ఈడీ దూసుకెళ్తోంది. కారు రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ విదేశీ సంస్థకి లేఖ రాయన్నారు. మరోవైపు ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీన్ బ్యాంక్‌‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఫార్ములా ఈ-కారు రేస్‌లో మనీ లాండరింగ్‌, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో కేటీఆర్‌‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read Also: Car Price: పెరిగిన కార్ల ధరలు.. ఏయే కంపెనీలు ఎంతేంత పెంచాయో చూద్దామా?

Show comments