sexually assault: సినీ రంగంలోకి వచ్చేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు. మరి కొందరు ఇండస్ట్రీలో కెరీర్ సెటిల్ చేసుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్ట్‌లగా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. తర్వాత పెద్ద స్థాయి ఆర్టిస్ట్‌గా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో సినిమాల్లో ఛాన్స్ ఇస్తామంటూ మభ్యపెట్టి చీటింగ్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలో జరిగిన ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది.
Read Also: Mohammed Shami: దేశం కోసం నిరంతరం శ్రమిస్తా.. షమీ భావోద్వేగ పోస్టు!
టీవీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సులో పరిచయం అయిన మేకప్ ఆర్టిస్ట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశాడు. ఇక, మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో మధురా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా సినిమా అవకాశాల పేరుతో మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.