Site icon NTV Telugu

BSF Jawan: ఇసుకలో పాపడ్ కాల్చిన జవాన్..వీడియో వైరల్

New Project (3)

New Project (3)

దేశ రక్షణలో జవాన్ల పాత్ర ఎనలేనిది. సరిహద్దుల్లో ఎండా.. వాన.. చలికి సైతం తట్టుకుంటూ నిలబడతారు. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు మరువలేనివి. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలా శత్రువు దాడిచేస్తాడో తెలియదు. తమ ప్రాణాలు ఒడ్డి దేశాన్ని కాపాడే సైనికుల త్యాగానికి విలువ కట్టలేం. తమ కుటుంబాలను వదలుకుని.. దేశం కోసం ప్రాణాలను ఒడ్డుతారు. వారి సేవలకు వెలకట్టలేం. బోర్డర్‌లో వారు కష్టాలను చూపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడారి ఎండలో వేడిక్కిన ఇసుకపై ఓ జవాన్ పాపడ్‌ను కాల్చిన వీడియోను అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

READ MORE: Viral Video: ఒక్కసారిగా ఇంట్లో ఎగిసిన మంట.. పిల్లాడి సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం..

వేసవిలో ఎండ తీవ్రతను తెలియజేసేందుకు ఎండ కొందరు రోడ్డుపై గుడ్డు పగులగొట్టి ఆమ్లేట్ వేస్తుంటారు. కాని సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్‌ను వేడెక్కిన ఇసుకపై కాల్చి రాజస్థాన్ ఎడారిలో ఎండ తీవ్రతను తెలియజేశారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్ సెగలు కక్కుతున్న వేడి ఇసుకలో పాపడ్‌ను ఉంచారు. దానిని 30 సెకన్ల తర్వాత తీసిచూడగా పూర్తిగా కాలి తినడానికి సిద్ధమైంది. దానిని తీసి చేతితో ముక్కలు చేసినలిపి చూపించారు. బికనీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంత వేడిలోనూ సైనికులు తన ప్రాణాలను లెక్కచేయకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్లపై నెటిజన్లు ప్రశంసల కురిపిస్తున్నారు. వారి త్యాగానికి సెల్యూట్ చేస్తున్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న జవాన్లకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సైనికులను మెచ్చుకుంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version