Divorce Case: తాజాగా చైనా దేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. 20 సంవత్సరాల పాటు సజావుగా కొనసాగుతున్న వివాహ బంధాన్ని విడదయడానికి అంగీకరించని భర్త కోర్టులోనే ఓ విచిత్ర సంఘటనకు పాల్పడ్డాడు. విడాకులకు సంబంధించి జడ్జిమెంట్ జరుగుతున్న సమయంలో వ్యక్తి తన భార్యను భుజాలపై ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. చట్టపరమైన విచారణ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన జరగడంతో ఈ విషయం కాస్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Konda Surekha: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
చైనా దేశానికి చెందిన లీ అతని భార్య చన్ 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.. ప్రతి ఒక్క వివాహ జీవితంలో ఉండే చిన్న, పెద్ద పొరపాట్లు వారి జీవితంలో కూడా ఉన్నాయి. అయితే, భర్త తనపై అత్యాచారం చేస్తున్నాడని అలాగే కుటుంబంలో హింసకు పాల్పడుతున్నాడని వారి ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసు వేసింది. అయితే ఈ విషయంలో మొదట కోర్టు ఆ దంపతుల మధ్య బలమైన అనుబంధం ఉందని వారి సంబంధాన్ని రక్షించే అవకాశం ఉండడంతో వారికి మొదట విడాకులు మంజూరు చేయలేదు. అయితే, అది ఒప్పుకోని భార్య చెన్ మళ్లీ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?
ఇకపోతే., ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో భర్త ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను కోర్టులోనే అందరి ముందర భుజాలపై మూసుకొని కోర్టు నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే, భార్య పెద్దగా అరవడంతో స్థానిక అధికారులు వారిని ఆపారు. అలా అధికారులు అతడు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి లీ మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పును తెలుసుకున్నానని, భవిష్యత్తులో ఇలాంటి పనులు తాను చేయనంటూ హామీ ఇచ్చాడు.