అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని ఇతర US కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాద స్థాయిని అంచన వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 9.3 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ‘‘ఆదివారం తెల్లవారుజామున 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముప్పు జారీ చేయబడింది. దీని కేంద్రం 5.78 మైళ్ల లోతులో ఉంది’’ అని యూఎస్జీఎస్ ట్వీట్ చేసింది. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అలస్కా, ఇతర తీర ప్రాంత ప్రజలు హుటాహుటిన తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..
మరోవైపు మే 25న కాలిఫోర్నియాలో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. ఈస్ట్ షోర్ కు నైరుతి దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో ఈ భూకంప కేంద్రం ఉందని, దాని లోతు 1.5 కిలోమీటర్లుగా ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్ జీఎస్) తెలిపింది.
Congress On UCC : అన్ని చట్టాల్లో ఏకరూపత అవసరం లేదు : కాంగ్రెస్
అయితే భూకంపానికి కారణమేంటంటే.. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపించడంతో.. భూకంపం వస్తుంది.