Site icon NTV Telugu

Helicopter Crash: పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం (వీడియో)

Helicopter Crash

Helicopter Crash

పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి కూడా బలంగా వీస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ పంకజా దేశ్‌ముఖ్‌ ప్రకటన వెలువడింది.

READ MORE: TG Vishwa Prasad: గబ్బు పట్టించారు.. ‘మిస్టర్ బచ్చన్’పై టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. “పూణేలోని పౌడ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. అది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తోంది. హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ పేరు ఆనంద్ సదర్. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చేరాడు. అందులో డీర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్ అనే మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.” అని పేర్కొన్నారు.

READ MORE:NRI Shot: ఎన్నారైపై కాల్పులు.. కాల్చొద్దని ప్రాధేయపడ్డ తల్లి, పిల్లలు

కాగా.. ఓ జాతీయ మీడియాతో ప్రత్యక్ష సాక్షి స్పందించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కమలేష్ మాట్లాడుతూ.. “హెలికాప్టర్ కింద పడిపోవడం చూశాను. హెలికాప్టర్ కిందపడగానే, నేను దాని సమీపంలోకి వెళ్ళాను. నేను హెలికాప్టర్ పైలట్‌తో మాట్లాడాను. కానీ ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు. భయాందోళనకు గురయ్యాడు. హెలికాప్టర్ ఎప్పుడైనా పేలవచ్చు కాబట్టి హెలికాప్టర్ నుంచి దూరంగా వెళ్ళమని సూచించాడు.” అని పేర్కొన్నారు.

Exit mobile version