NTV Telugu Site icon

SDG Summit: ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్

3

3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 – 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకే పరిమితమైన ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక, యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే తొలిసారి.

Man Or Crow: మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు.. రహస్యం చెప్పిన శాస్త్రవేత్తలు

ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా.. ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. అంతేకాకుండా.. సీఎం జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య మరియు పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరించనున్నారు.

Deva Singh Chauhan: చంద్రబాబు అరెస్ట్ కేసు.. సరైన సమయంలో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుంది

ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే.. ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే.. ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సదస్సులో పాల్గొంటున్నారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.. ఏపీలోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి మరియు కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా, నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

Show comments