Poisonous Snakes: ఏటా ఘనంగా పాముల జాతర..విషసర్పాలను నోటిలో కరచుకుని ఊరేగింపు
- సమస్తిపూర్‌లో ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున ఈ అద్భుతమైన పాముల జాతర
- జాతరను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు
- పాములకు ధైర్యంగా చేతిలో..నోటితో పట్టుకుని ఊరేగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగల సమయంలో నిర్వహించే జాతరలను మీరు చాలానే చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పాముల జాతరను చూశారా? దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. కానీ ఇది పూర్తిగా నిజం.. ఈ ప్రత్యేక పాముల జాతర బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో నిర్వహిస్తారు. సమస్తిపూర్‌లో ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున ఈ అద్భుతమైన పాముల జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ఈ జాతరలో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ పాముల జాతర గత మూడు వందల సంవత్సరాలుగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
READ MORE: Purushothamudu Review: పురుషోత్తముడు రివ్యూ!
Also Read
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
జిల్లాలోని సింఘియాలో నాగ పంచమి రోజున ఈ జాతర జరుగుతుంది. రాత్రంతా ప్రార్థనలు చేసిన తరువాత.. ప్రజలు ఊరేగింపుగా బయలుదేరి నదికి వెళతారు. స్నానం చేసి పాముకి పాలు, గుడ్డును భక్తితో సమర్పించుకుంటారు. ఇందులో వందలాది మంది భగత్‌లు (పాములను పట్టుకునే వ్యక్తులు) పాల్గొంటారు. బుధి గండక్ నదిలో స్నానం చేసి..ఆపై పాములను పట్టుకునే ఆట ప్రారంభమవుతుంది. గండక్ నదిలో స్నానం చేసి నీటిలో నుంచి పాములను చేతిలో పెట్టుకుని..నోటిలో కరచుకుని బయటకు తీస్తారు.
READ MORE:Sessions of Parliament: “జేబులో చేతులు పెట్టుకుని రావొద్దు.” మంత్రిపై లోక్‌సభ స్పీకర్ ఫైర్..
పాములు తన స్నేహితులంటూ మెడకు, చేతులకు చుట్టుకుంటారు. అక్కడి నుంచి ఊరేగింపుగా.. భగత్ రామ్ సింగ్ మాతా విశ్వ హరి ఆలయానికి వెళతారు. నది నుంచి డజన్ల కొద్దీ పాములను బయటకు తీసినట్లు చెబుతారు. వాటిలో చాలా విషసర్పాలు ఉన్నాయి. నదిలో నుంచి ఎవరు ఎన్ని పాములను త్వరగా బయటకు తీయాలన్న పోటీ నెలకొంది. ఈ రోజున ఇక్కడి ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు చెబుతారు. సిద్ధి పూర్తయిన తర్వాత నది నుంచి బయటకు తీసిన పాములను సురక్షిత ప్రదేశాల్లో వదిలేస్తామని పాములను తొలగించే భక్తులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద సమస్తిపూర్‌లో మాత్రమే పాముల జాతర నిర్వహించబడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!