ప్రపంచంలో ఉండే మనుషులు వింత వింత రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. కొంతమందికి దుమ్ము అలర్జీ, స్మెల్ అలర్జీ.. ఇలా రకరకాల అలర్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి అలర్జీతో బాధపడటం మీరెప్పుడైనా విన్నారా.. ?. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ యువతి తలస్నానం చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెబుతోంది. భరించలేని నొప్పితో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయని తెలుపుతుంది.
22 ఏళ్ల యువతి లారెన్ మోంటెఫుస్కో ఆక్వాజెనిక్ ఉర్టికేరియాతో బాధపడుతుంది. ఇది ఒక రకమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు 37 కేసులు మాత్రమే నమోదయ్యాయి. లారెన్ పొరపాటున స్నానం చేసినా లేదా నీటిని తాకినా.. ఆమె శరీరం మొత్తం ఒక గంట పాటు దురదగా ఏర్పడుతుంది.
Minister Buggana Rajendranath Reddy: భారత్‌లోనే విశాఖ అన్ని ప్రాధాన్యతలు వున్న నగరం..
అంతేకాదు.. ఆమె శరీరం నుంచి వచ్చే చెమట కూడా తనకు ప్రాణాంతకం అని లారెన్ చెబుతుంది. ఎందుకంటే.. ఎక్కడినుంచి చెమట వస్తుందో అక్కడ ఎర్రటి దద్దుర్లు వస్తాయని పేర్కొంది. ఈ వ్యాధితో తన జీవితం కష్టంగా ఉందని లారెన్ చెప్పింది. అంతేకాకుండా.. తన శరీరాన్ని గోకకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను, కానీ ఆపుకోలేకపోతున్నట్లు చెబుతుంది.
లారెన్ 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ వ్యాధి వచ్చింది. ఆ తర్వాత ఇంక ఎక్కువగా పెరిగిందని చెబుతుంది. కాగా.. 15 సంవత్సరాల వయస్సులో ఆమె మొదటిసారిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నట్లు తెలిపింది. ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఈ వ్యాధికి నివారణ లేదని.. వీలైనంత వరకు నీటికి దూరంగా ఉండటమేనని లారెన్ తెలిపింది.
