NTV Telugu Site icon

Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి

Girl

Girl

Harrasment : ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై తన పెంపుడు తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలను చూసి షాకయ్యారు. చికిత్స చేస్తున్న ఒంటిపైనే కాదు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లోనూ వారికి చెక్క భాగాలు కనిపించాయి. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

Read Also: Boat Capsized : మహిళా కూలీలతో వెళ్తున్న బోటు బోల్తా

తీవ్ర గాయాలపాలైన బాలికను ఓ మహిళ ఆస్పత్రిలో చేర్చింది. ఇంట్లో తోబుట్టువులతో గొడవపడి గాయపడ్డానని బాలిక తెలిపింది. ఆమెకు చికిత్స అందించాలని పెంపుడు తల్లి కోరింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలను చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో చెక్క భాగాలు కనిపించాయి. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. మరుసటి రోజు బాలికను తీసుకొచ్చిన మహిళ ఆసుపత్రికి వచ్చింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను తాను దత్తత తీసుకున్నానని, ఇంట్లో పిల్లలతో జరిగిన గొడవలో బాలిక గాయపడిందని పోలీసులకు తెలిపింది.

Read Also: Sextortion Call : సరికొత్త ట్రాప్.. ‘సెక్స్‌టార్షన్’ బారిన పడ్డ 76ఏళ్ల వ్యక్తి

అయితే ఆమె సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో బాలికను పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక చేయి కూడా విరిగిందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం బాలికను ప్రభుత్వ సంక్షేమ కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో, తన పెంపుడు తల్లి తనను హింసించిందని బాలిక తెలిపింది. నెలలో సగం రోజులు ఆహారం ఇస్తారని, తాను ఆకలితో ఉండేవారని బాలిక తెలిపింది. నిందితురాలిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Show comments