NTV Telugu Site icon

Lok Sabha Elections 2024 : పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..?

Bus Fire

Bus Fire

పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు దూకిన సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ జిల్లాబేతుల్ జిల్లా సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఆరు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందితో పాటు ఈవీఎంలు, ఓటింగ్‌ మెటీరియల్‌ ఉన్నట్లు కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. రెండు పోలింగ్‌ కేంద్రాల్లోని సామగ్రి పూర్తిగా దగ్ధం కాగా, నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోని కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయి. రాజాపూర్, దూదర్, గెహుబర్సా వీట్ బర్సా, కుందరాయత్, చిఖ్లీ మాల్ కి పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎం, వీవీ ప్యాట్లు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించినట్లు కలెక్టర్ తెలిపారు.

READ MORE: Israel-Hamas War : రఫా సరిహద్దును స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. కాల్పుల విరమణకు హమాస్ ఓకే

బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌ బస్సును ఆపేశాడు. ఇంతలో బస్సు గేర్ బాక్స్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది వెంటనే బస్సు నుంచి బయటకు దూకేశారు. కొంత మంది సీటు పక్కనున్న కిటికీల నుంచి బయటకు రాగా మరి కొందరు వెనుకనున్న అద్ధం పగులగొట్టుకుని దూకారు. అందరూ సురక్షితంగా బయట పడగా.. బస్సు నుంచి దూకడం వల్ల కొంతమంది ఉద్యోగులకు పాక్షికంగా గాయాలయ్యాయి. బేతుల్ జిల్లా కేంద్రం నుంచి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కాగా.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే ఏడున మూడో విడత పోలింగ్ జరిగింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఇందులో మధ్య ప్రదేశ్ కూడా ఒకటి. మధ్యప్రదేశ్ లోని తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే బేతుల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఎన్నికల సామగ్రి కాలిపోయింది.. కాబట్టి అక్కబ రీపోలింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు.

Show comments