NTV Telugu Site icon

Fire Accident: నాచారం సురానా వైర్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

Fire Accident

Fire Accident

నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

READ MORE: ESIC Jobs: భారీగా జీతాలు.. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాగా.. ఇటీవల పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండడంతో పాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఇందుకు కారణం. పారిశ్రామిక వాడలు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారాయి. ఆయా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ర్టాలతోపాటు బీహార్‌, గుజరాత్‌, ఒరిస్సా తదితర రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు. ముఖ్యంగా పటాన్‌చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం, కంది, హత్నూర, సదాశివపేట తదితర మండలాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరుగుతున్నాయి. దీంతో కార్మికుల భద్రత సవాలుగా మారుతోంది.

READ MORE: Hyderabad: రాచకొండ పరిధిలో గన్స్ విక్రయం.. మూడు తుపాకులు స్వాధీనం..

Show comments