NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు..

Delhi

Delhi

ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పోరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేకి అని అజయ్ మాకెన్ అనడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.

READ MORE: Dil Raju: తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే మా లక్ష్యం..

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాట్లాడుతూ.. “ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీజేపీతో కలిసి పని చేస్తోందని కాంగ్రెస్‌ ప్రకటనలు, చర్యలను ద్వారా స్పష్టమైంది. నిన్న అజయ్ మాకెన్ అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అని అన్నారు. ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడిపైనా ఇలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ఆప్ నాయకుడిపైన మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు తేటతెల్లమైంది.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

మరోవైపు ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. “ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అజయ్ మాకెన్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడైన ఆయన బీజేపీ స్క్రిప్ట్‌ను ఫాలో అవుతున్నారు. బీజేపీ ఆదేశాల మేరకు వారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. నిన్న పరిమితి దాటే వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌. ఆయనను దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అయితే ఢిల్లీ ప్రజలకు విద్య, వైద్యం, విద్యుత్‌, నీరు, ఉపాధి ఏ విధంగా అందించారు?.” అని మండిపడ్డారు.

Show comments