NTV Telugu Site icon

Nandyala: ఇలా తయారయ్యారేంట్రా..?అమ్మాయి కోసం విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ..

Students

Students

నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. వారు నేర్చుకున్న విద్యను వారు సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్తులో మన దేశాన్ని ముందుకి నడుపుతారని భావిస్తారు. కానీ కొంత మంది విద్యార్థులు మాత్రం దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. కళాశాల స్థాయికి రాగానే తమను తాము హీరోలమనుకుంటారు. వారి చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న శ్రమని మర్చిపోతున్నారు. పుట్టెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం విలపిస్తున్నారు. కశాళాల వయసులో అమ్మాయిల కోసం దేనికైనా దిగజారుతున్నారు. అందరూ ఇలాగే ఉన్నరని కాదు.. ప్రస్తుతం ఇలా చాలా మంది తయారవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.

READ MORE: Love Jihad: “లవ్ జిహాద్‌”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోన్ లో విద్యార్థుల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. ఒక గ్రూప్ పై మరో గ్రూప్ దాడి, ప్రతి దాడులు
చేసుకున్నాయి. ఒక ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. గత నెల 24న ఓ అమ్మాయి విషయంలో మోడల్ స్కూల్ విద్యార్థులు.. డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా గా 28న మోడల్ స్కూల్ విద్యార్థిపై దాడి చేశారు. తాజాగా ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విద్యార్థి దశలోనే రివెంజ్ దాడులేంటి అని వాట్సప్ గ్రూపుల్లో చర్చ నడుస్తోంది.

Show comments