NTV Telugu Site icon

Accident : ఘోరం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రవెల్స్ బస్సు.. నలుగురు మృతి

Accident

Accident

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం.. నుజ్జును నుజ్జైంది. తెల్లవారు జామున 3.30 – 4.00 గంటల మధ్యలో జరిగిన దుర్ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ, రూరల్ సీఐ, చివ్వేంల ఎస్ఐ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ టైర్
పేలడంతో పక్కకు ఆపినట్లు డ్రైవర్ తెలిపాడు.

READ MORE: Donald Trump: నేడు హష్‌ మనీ కేసులో ట్రంప్‌కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్..

Show comments