NTV Telugu Site icon

Asia Cup 2023: బంగ్లాదేశ్కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌.. శ్రీలంకతో ఓడిపోతే సర్దుకోవాల్సిందే

Bangla Match

Bangla Match

2023 ఆసియా కప్‌లో భాగంగా.. రేపు(శనివారం) శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు ‘డూ ఆర్ డై’ లాంటిది. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఓడిపోతే.. నిష్క్రమించడం దాదాపు ఖాయం. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘోర ఓటమి చెందింది. ఇప్పుడు బంగ్లా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్ గెలిచి క్వాలిఫై అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. లీగ్ దశలో నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ సెంచరీలు చేసి అద్భుతమైన ప్రదర్శన చూపించారు. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన చూపించారు. దీంతో శ్రీలంకపై 164, పాకిస్థాన్‌పై 193 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Also: Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరుపుతున్న రష్యా..

మరోవైపు శ్రీలంక జట్టులో మహిష్ తిక్ష్ణ, మతిషా పతిరనా వంటి కీలక బౌలర్లు ఉన్నారు. బంగ్లాదేశ్‌ను 200 కంటే తక్కువ స్కోరు వద్ద ఆపడంలో ఈ ఇద్దరు బౌలర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతేకాకుండా.. ఆఫ్ఘనిస్తాన్‌పై నాలుగు వికెట్లు తీసిన కసున్ రజిత కూడా మంచి ఫాంలో ఉన్నాడు. ఇలాంటి బౌలింగ్ లైనప్ ముందు బంగ్లాదేశ్ మంచి స్కోరు సాధించాలంటే.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
ఇక గాయం కారణంగా శాంటో ఆసియా కప్ కు దూరం కానున్నాడు. దీంతో బంగ్లా జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. లీగ్ దశలో సూపర్ సెంచరీ చేసిన అతనిపై జట్టుకు చాలా నమ్మకం ఉండేది. దీంతో బంగ్లాదేశ్ కు దెబ్బ మీద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే అతని స్థానంలో లిటన్ దాస్ జట్టులోకి వచ్చాడు. అతని నుండి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తుంది.

Read Also: Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి షకీలాకు పానిక్ ఎటాక్..?

అటు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా ఫాంలో లేడు. అతని నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. చాలా సందర్భాలలో పేలవ ప్రదర్శన చూపించిన షనక.. ఇప్పటికైనా అతని ఆట తీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలంటే బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌, షోరీఫుల్‌ ఇస్లామ్‌తో పాటు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా బౌలింగ్‌ లో రానించాల్సి ఉంటుంది.