NTV Telugu Site icon

Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..

Car Parking

Car Parking

ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్‌గా అధికారులు గుర్తించారు.

Delhi: శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ

ఈ కేసు సంబంధించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో మాట్లాడుతూ.., గురువారం ఉదయం 9:40 గంటలకు విషయం పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్)కి అందింది. ఒక పార్క్ చేసిన కారులో మృతదేహం, దాని చుట్టూ రక్తం చిమ్ముతూ లోపల పడి ఉందని తెలిపారు. నెహ్రూ ప్లేస్‌లోని దేవికా టవర్ పక్కన పహద్‌పూర్ బిజినెస్ సెంటర్ ముందు ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోగా, డ్రైవర్ సీటుపై రక్తంతో మృతదేహం కనిపించింది.

కారు అన్ని వాకిళ్లు లాక్ చేయబడి ఉన్నందున, వెనుక అద్దాలు పగలగొట్టి కారు తెరవగా., ముఖం, తొడ, రెండు చేతులపై కాలిన గాయాలతో వ్యక్తి స్టీరింగ్ వీల్‌పై చనిపోయినట్లు గుర్తించబడిందని తెలిపారు. కారులోపల పెట్రోలు వాసన వస్తోందని, మృతుడి వెంట్రుకలు పూర్తిగా పాడైపోయాయని, స్టీరింగ్ పాక్షికంగా కాలిపోయిందని.. టీషర్టులో మసి ఉందని డీసీపీ తెలిపారు. ముందు సీటులో వాడిన వాటర్ బాటిల్, ఉపయోగించిన అగ్గిపుల్లలు కూడా ఉన్నాయని., ఆ తర్వాత ఏరియా సిసిటివిని యాక్సెస్ చేయగా, మృతుడు తెల్లవారుజామున 3:30 గంటలకు తన కారులో సంఘటనా స్థలానికి వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. ఏడు నిమిషాల తరువాత, కారులో భారీ మంటలు రాగా., ఆ తరువాత ఒక నిమిషం తర్వాత తగ్గిపోయిందని చెప్పారు.

Navdeep: 23 ఏళ్లలో ర‌క‌ర‌కాల మ‌నుషుల‌ను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ

ధ్రువ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, ఆ తర్వాత మృతుడు హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యి, ఊపిరాడక మృతి చెందాడని డీసీపీ తెలిపారు. విచారణలో, బెంగళూరులో నివసిస్తున్న మృతుడి సోదరి పూర్వి మహాజన్, ధ్రువ్ భారీ అప్పుల్లో ఉన్నాడని తెలియజేసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి విచారణ ప్రక్రియను చేపట్టారు.